దర్శక ధీరుడు రాజమౌళి  ఎన్టీఆర్ మరియు రాం చరణ్ హీరోలుగా  అఠ్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగా ముల్టిస్టర్ చిత్రం rrr
ఈ చిత్రం లో రాం చరణ్ కి జోడీ గా బాలీవుడ్ భామ అలియా భట్
ఎన్టీఆర్ కి జోడిగా ఇంగ్లీష్ భామ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.
ఏ చిత్రం లో రాం చరణ్ అల్లూరి సీతారామ రాజు గా ఎన్టీఆర్ కొమరం భీం గా మనకి కనిపిస్తున్నారు.
ఎన్టీఆర్ సరసన జెన్నీఫర్ పాత్రలో 'ఒలీవియా మోరిస్',బ్రిటీష్ స్కాట్ పాత్రలో రే స్టీవెన్‌సన్,లేడీ స్కాట్‌గా అలీసన్ డూడీ నటిస్తున్నట్టు ప్రకటించడంతో.. గూగుల్‌లో దేశవ్యాప్తంగా ఎంతోమంది నెటిజెన్స్ వీరి గురించి వెతకడం మొదలుపెట్టారు. గతంలో వీరు చేసిన సినిమాలు.. వీరికున్న పాపులారిటీ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఒలీవియా మోరిస్ పేరు ఇండియాలో ఎక్కువసార్లు ట్రెండ్ అయింది. బుధవారం ఒక్కరోజే దాదాపు 2లక్షల సార్లు ఆమె పేరును గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఇదే విషయాన్ని RRR చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రేక్షకులు సినిమా పట్ల ఇంత క్యురియాసిటీతో ఉండటంపై సంతోషం వ్యక్తం చేసింది. మొత్తం మీద హాలీవుడ్ క్యాస్టింగ్‌తో RRR సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తీసుకొచ్చాడు జక్కన్న.


Comments

Popular Posts